రంగారెడ్డి జిల్లా హయాత్నగర్ మండలం కుంట్లురులోని గాంధీ బీఈడీ కళాశాలలో జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ఛైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. అందురు చేనేత వస్త్రాలు ధరించాలని కోరారు. తద్వారా చేనేత వృద్ధికి కృషి చేయాలన్నారు. చేనేత కళాకారుల కళానైపుణ్యం కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
National Handloom Day: అందరూ చేనేత వస్త్రాలు ధరించాలి: రాజేందర్ రెడ్డి - telangana news
చేనేత వస్త్రాలు ధరించాలని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ఛైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి కోరారు. రంగారెడ్డి జిల్లా హయాత్నగర్ మండలం కుంట్ల రులోని గాంధీ బీఈడీ కళాశాలలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
చేనేత కళానైపుణ్యాన్ని ప్రజలకు చేరే విధంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ తెలుగు రాష్ట్రాల్లో విస్తృతస్థాయిలో కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. అనంతరం చేనేత వస్త్రాలు వాడాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్న కళాకారులు విష్ణుమూర్తి, విట్టలేశ్వర్, కృష్ణ, విజయ్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రీ, కన్వీనర్ డా. మెరుగు మధు, సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ప్రతినిధులు బుర్ర దశరత గౌడ్, గుండాల గోవర్ధన్, సురేందర్, సుభాష్ చంద్ర, మైనేని వాణి పాల్గొన్నారు.
ఇదీ చదవండి:SLEEPING PROBLEMS: నిద్రాదేవికి ఆహ్వానం పలకండిలా..!