కరోనాతో చనిపోయిన వారికి అంతిమ గౌరవం దక్కడం లేదు. చివరికి రక్త సంబంధీకులు, కుటుంబ సభ్యులూ ఒంటరిగా వదిలేస్తున్నారు. అలాంటి సంఘటనే రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణంలో బుధవారం జరిగింది. శ్రీనివాస కాలనీకి చెందిన కొండోజు చంద్రకళ(63) కరోనాతో బుధవారం మృతి చెందింది. అమెకు అంత్యక్రియలు చేయడానికి కుటుంబ సభ్యులు, బంధువులు ముందుకు రాలేదు.
ఓడిన రక్త బంధం.. గెలిచిన మానవత్వం
కొవిడ్‌తో చనిపోయిన ఓ మహిళకు అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు కల్వకుర్తి పట్టణానికి చెందిన ముస్లిం యువకులు. రక్త సంబంధీకులు, కుటుంబ సభ్యులు వెనకడుగు వేసిన క్రమంలో.. కులమతాలకు అతీతంగా తామున్నామంటూ ముందుకు వచ్చారు. రక్తబంధం ముందు మానవత్వం గెలిచిందని నిరూపించారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణంలో చోటుచేసుకుంది.
Kalwakurthy, coron death
విషయం తెలుసుకున్న కల్వకుర్తి పట్టణానికి చెందిన ముస్లిం యువకులు అబ్దుల్‌ఖాదర్, ఇమ్రాన్, ఖాజా, గౌస్, సలీమ్, షాకిర్ కులమతాలను పక్కనపెట్టి తామున్నామంటూ ముందుకు వచ్చారు. చంద్రకళ మృతదేహాన్ని ఇంటి నుంచి శ్మశాన వాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తిచేశారు. రక్తబంధం ముందు మానవత్వం గెలిచిందని నిరూపించారు. కల్వకుర్తి ప్రాంతంలో కరోనాతో మృతి చెందిన వారికి వీరు అంత్యక్రియలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు.
ఇదీ చూడండి:ఆటలోనే ముగిసిన చిన్నారి ఆయుష్షు