మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ప్రచార పర్వం ఊపందుకుంది. జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలోని ఇరవై ఎనిమిది వార్డుల్లో పలు పార్టీలకు చెందిన నాయకులు ప్రచారాలు నిర్వహిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. వార్డులో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని వారికి హామీ ఇస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు..తెరాస, కాంగ్రెస్ అభ్యర్థులు పోటాపోటీగా వార్డుల్లో తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. మరికొందరు నాయకులు అంతర్గతంగా వార్డుల్లో సమాచారాన్ని సేకరిస్తూ ఓటర్ల దగ్గరికి వెళ్తున్న పరిస్థితి నెలకొంది.
ఊపందుకున్న పుర ఎన్నికల ప్రచారపర్వం - election compaign
పుర ఎన్నికల ప్రచారపర్వం ఊపందుకుంది. నామినేషన్ల ప్రక్రియ ముగియడం వల్ల అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలో పలు పార్టీలకు చెందిన నాయకులు పోటాపోటీగా ప్రచారంలో పాల్గొంటున్నారు.
ఊపందుకున్న పుర ఎన్నికల ప్రచారపర్వం
మరోవైపు నామినేషన్ల పరిశీలన ఉండడంతో మున్సిపల్ ఆఫీసు వద్ద అభ్యర్థులు తమ నామపత్రాల్లో ఎలాంటి తప్పులు లేకుండా సరిచూసుకుంటున్నారు. ఈ రోజు నామినేషన్ల పరిశీలనలో భాగంగా 28 వార్డులకు సంబంధించిన అభ్యర్థులు తమ పత్రాలను అధికారులకు అందజేశారు.
ఇవీ చూడండి: 'పురపోరులో విజయ ఢంకా మోగించాలి'