తెలంగాణ

telangana

ETV Bharat / state

అబ్దుల్లాపూర్​మెట్​లో నూతన తహసీల్దార్​ కార్యాలయం ప్రారంభం - అబ్దుల్లాపూర్​మెట్​లో నూతన తహసీల్దార్​ కార్యాలయం ప్రారంభం

అబ్దుల్లాపూర్​మెట్​లో తహసీల్దార్ హత్య సంచలనం సృష్టించింది. 24 రోజుల అనంతరం అధికారులు నూతన తహసీల్దార్​ కార్యాలయంను ప్రారంభించారు. నూతన తహసీల్దార్​గా వెంకట్​రెడ్డి బాధ్యతలు చేపట్టారు.

mro-office-started-at-abdullapurmet-in-rangareddy-district
అబ్దుల్లాపూర్​మెట్​లో నూతన తహసీల్దార్​ కార్యాలయం ప్రారంభం

By

Published : Nov 28, 2019, 11:00 PM IST

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​లో ఈ రోజు నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ నెల 4న ఎమ్మార్వో విజయారెడ్డిపై సురేష్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన విషయం విదితమే. 24 రోజుల తర్వాత ప్రత్యేక పూజలు చేసి కార్యాలయాన్ని అధికారులు ప్రారంభించారు. నూతన తహసీల్దార్​గా ఎమ్మార్వో వెంకట్ రెడ్డి ఛార్జి తీసుకున్నారు.
తహసీల్దార్ కార్యాలయానికి మధ్యవర్తిత్వం వహించే వారు రావద్దని, సిబ్బంది ప్రజలతో మమేకమై పని చెసినప్పుడు ఎలాంటి ఘటనలు జరగవని అధికారులు తెలిపారు. త్వరలోనే ప్రభుత్వం స్థలం కేటాయిస్తే సొంత భవనాలు నిర్మిస్తామని చెప్పారు. నూతనంగా బాధ్యతలను చేపట్టిన తహసీల్దార్ వెంకట్​రెడ్డి వారం రోజుల్లో పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తామని తెలిపారు.

అబ్దుల్లాపూర్​మెట్​లో నూతన తహసీల్దార్​ కార్యాలయం ప్రారంభం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details