ఇటుక బట్టీల్లో పనిచేస్తూ లాక్‌డౌన్‌తో పనుల్లేక పస్తులుంటున్న వలస కూలీలను అధికారులు స్వస్థలాలకు పంపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, ఆదిభట్లలోని ఇటుక బట్టీల్లో పని చేసేందుకు 1000 మంది కార్మికులు ఒడిశా రాష్ట్రం నుంచి వచ్చారు. వీరికి వైద్య పరీక్షలు నిర్వహించి ధ్రువపత్రాలు అందజేశారు.
ఒడిశాకు వలస కార్మికుల తరలింపు - movement-of-migrant-workers
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, ఆదిభట్లలోని ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఒడిశాకు చెందిన 1000 మంది వలస కార్మికులను అధికారులు ప్రత్యేక రైళ్లలో స్వరాష్ట్రానికి పంపించారు.
ఒడిశాకు వలస కార్మికుల తరలింపు
అనంతరం వీరిని బోయిన్పల్లి రైల్వే స్టేషన్కు తరలించారు. వీరిని బలంగిర్, నవాబ్ పూర్ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లలో పంపుతున్నట్లు ఇబ్రహీంపట్నం ఏసీపీ యాదగిరి రెడ్డి తెలిపారు.