దోమల నివారణకు బల్దియా వినూత్న కార్యక్రమం చేపట్టింది. దాంట్లో భాగంగా చందానగర్ సర్కిల్ లోని మియాపూర్ గురునాథం చెరువులో డ్రోన్ ద్వారా లార్వా నివారణ మందును స్ప్రే చేసే కార్యక్రమాన్ని నగర మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించారు. ఈ మందు ద్వారా చెరువులో ఉన్న గుర్రపుడెక్క విస్తరణకు కూడా అడ్డుకట్ట పడుతుందన్నారు. దాదాపు 20 ఎకరాలకు పైగా ఉండి గుర్రపుడెక్కతో నిండిని చెరువులో దోమల ఉత్పత్తి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పరిసర ప్రాంతాల నివాసితులు జీహెచ్ఎంసీ అధికారులను ఆశ్రయించారు. వారి సమస్యకు స్పందించిన బల్దియా దోమల నివారణ కార్యక్రమానికి పూనుకుంది. శేరిలింగంపల్లి జోన్ లోని పలు చెరువులతో పాటు మూసి నదిలో కూడా డ్రోన్ సహాయంతో యాంటి లార్వా ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించామని మేయర్ గుర్తుచేశారు.
డ్రోన్ సహాయంతో దోమల సంతతికి స్వస్తి - రంగారెడ్డి జిల్లా
రంగారెడ్డి జిల్లా చందానగర్ సర్కిల్లోని మియాపూర్ గురునాథం చెరువులో డ్రోన్ ద్వారా దోమ లార్వా నివారణ మందును స్ప్రే చేసే కార్యక్రమాన్ని నగర మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించారు.
డ్రోన్ సహాయంతో దోమల సంతతికి స్వస్తి