రంగారెడ్డి జిల్లా ఉమర్ఖాన్గూడలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. స్థానిక తెరాస నాయకుడు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికీ నిత్యావసరాలు అందజేశారు. లాక్డౌన్ దృష్ట్యా గ్రామంలోని పేదలను ఆదుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయాలన్నారు. కార్యక్రమంలో తెరాస నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నిత్యావసర సరకులు పంచిన ఎమ్మెల్యే - ఉమర్ఖాన్గూడలో నిత్యావసరాల పంపిణీ
రంగారెడ్డి జిల్లా ఉమర్ఖాన్గూడలో పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సూచించారు.
నిత్యావసర సరకులు పంచిన ఎమ్మెల్యే