తెలంగాణ

telangana

ETV Bharat / state

‘అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం’ - minister srinivas goud

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలోని కందవాడ గ్రామంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యల తో కలిసి పాల్గొని మంత్రులు మొక్కలు నాటారు. అనంతరం మండల కేంద్రంలో కొత్తగా నిర్మించిన ఎక్సైజ్ శాఖ కార్యాలయాన్ని ప్రారంభించారు.

ministers Srinivas goud, sabitha reddy opens Exice office
‘అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం’

By

Published : Sep 22, 2020, 2:22 PM IST

గత ప్రభుత్వాలు కులవృత్తులను నాశనం చేయడం వల్ల గ్రామాల్లో ఎన్నో కుటుంబాలకు ఉపాధి లేకుండా పోయిందన్నారు మంత్రి శ్రీనివాస్​ గౌడ్. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా చొరవ తీసుకొని కులవృత్తులను ప్రోత్సహించడమే గాక.. వారి అభివృద్ధి కోసం బడ్జెట్​లో నిధులు కేటాయిస్తున్నారని గుర్తు చేశారు. రంగారెడ్డి జిల్లా కందవాడ గ్రామంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యల తో కలిసి పాల్గొని మంత్రులు మొక్కలు నాటారు. అనంతరం మండల కేంద్రంలో కొత్తగా నిర్మించిన ఎక్సైజ్ శాఖ కార్యాలయాన్ని ప్రారంభించారు.

కుల వృత్తిదారులు గౌరవంగా జీవించేలా చేయడం, నూతన రెవెన్యూ చట్టంతో రైతులకు మేలు జరగడం వంటి ఎన్నో సంస్కరణలకు తెలంగాణ ప్రభుత్వం నాంది పలుకుతోందని మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ అన్నారు. భవిష్యత్తులో దేశంలోనే తెలంగాణ అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తుందని.. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అందరూ కృషిచేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. 2017 నాటికి డిగ్రీ, ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారందరిని ఓటరుగా నమోదు చేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ ఛైర్మన్ కృష్ణారెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి, వైస్ ఎంపీపీ శివప్రసాద్, సర్పంచ్ శైలజా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:ఉన్నదంతా ఊడ్చేస్తున్న కరోనా.. ఆర్థికంగా చితికిన బాధితులు

ABOUT THE AUTHOR

...view details