Minister Sabitha indra reddy: జీవో 111 ఎత్తివేయడం వల్ల హిమాయత్ సాగర్, గండిపేట జలాశయాలకు ఎలాంటి ముప్పు వాటిల్లదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జీవో 111 ఎత్తివేయడంపై భాజపా నాయకులు హైదరాబాద్ ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. రాష్ట్ర భాజపా నాయకుడు బండి సంజయ్ ప్రజల సమస్యలను విస్మరించి రాజకీయం కోసం విమర్శలు చేస్తున్నారని సబితా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం జంట జలాశయాలకు సంబంధించి ఎలాంటి కాలుష్యం కాకుండా అన్ని ప్రణాళికలతో ఉందన్న సబితా ఇంద్రారెడ్డి.. 111జీవో ఎత్తివేతపై విమర్శలు చేసే నాయకులు 84 గ్రామాల ప్రజల మధ్యకు వచ్చి మాట్లాడాలని సూచించారు. 111జీవో ఎత్తివేత వల్ల ఆ ప్రాంతాల్లో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి జరుగుతుందని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
'జీవో 111ను ఎత్తివేయడాన్ని విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి'
Minister Sabitha indra reddy: జీవో 111 ఎత్తివేయడంపై భాజపా నాయకులు హైదరాబాద్ ప్రజలను రెచ్చగొడుతున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జీవో 111 ఎత్తివేయడం వల్ల హిమాయత్ సాగర్, గండిపేట జలాశయాలకు ఎలాంటి ముప్పు వాటిల్లదని ఆమె స్పష్టం చేశారు.
విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి..చెరువుల పరిరక్షణ కోసం ప్రభుత్వం కమిటీ వేసింది. 111 జీవోను ఎత్తివేయడాన్ని విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. బాధ్యతను విస్మరించి రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. కేసీఆర్, కేటీఆర్ కోసమే 111 జీవో ఎత్తివేశారని ఆరోపిస్తున్నారు. జంట జలాశయాలు కలుషితం కాకుండా ఉండేందుకే 111 జీవో తెచ్చారు. 84 గ్రామాల ప్రజల ఇబ్బందులు గమనించి విపక్షాలు మాట్లాడాలి. స్వార్థంతోనే 111 జీవో ఎత్తివేశారని ఆరోపిస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం విపక్షాలు ఇష్టారీతిన మాట్లాడుతున్నాయి. ఇప్పుడు ఈ జీవోను ఎత్తివేయడం వల్ల 84 గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. - సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర మంత్రి
ఇవీ చదవండి: