స్వచ్ఛత ఉన్నప్పుడే అన్ని విధాలుగా పల్లెలు అభివృద్ధి చెందుతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శంషాబాద్‌లోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో జరిగిన పల్లెప్రగతి కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
రంగారెడ్డి జిల్లాలో ట్రాక్టర్ల పంపిణీ - Minister sabitha indrareddy latest news
జాతిపిత మహాత్మగాంధీ కలలు కన్న గ్రామాలను తయారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని పలు గ్రామాలకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు.
Minister sabitha indrareddy distributed 106 tractors
ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లాకు చెందిన 106 గ్రామ పంచాయితీలకు ట్రాక్టర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, జయపాల్ యాదవ్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:గ్రామాల్లో వైకుంఠధామాలు, డంపింగ్ యార్డుల నిర్మాణం