Sabitha visit temple: గత రెండు సంవత్సరాలుగా కరోనాతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కేంద్రంలోని శివగంగా శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శివలింగానికి అభిషేకం నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. జిల్లాలోని పురాతనమైన శ్రీ రాజరాజేశ్వరి శైవ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు.
Sabitha visit temple: శ్రీ రాజరాజేశ్వరి శైవక్షేత్రంలో సబిత ప్రత్యేక పూజలు - శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో సబిత పూజలు
Sabitha visit temple: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పురాతనమైన శైవ క్షేత్రాల్లో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కేంద్రంలోని శివగంగా శ్రీ రాజరాజేశ్వరి దేవాలయాన్ని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి దర్శించుకున్నారు.
శివలింగానికి అభిషేకం చేస్తున్న విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి
కరోనాతో రెండేళ్లుగా ఆలయాల్లో దర్శనానికి ప్రజలు రాలేక పోయారని మత్రి పేర్కొన్నారు. ఈ ఏడాది వైరస్ తగ్గడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటారని . భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 35 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ కమిటీ ఛైర్మన్ సుధీర్ గౌడ్ వెల్లడించారు.
ఇదీ చూడండి: