రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. చేవెళ్ల నుంచి మల్కాపూర్ వరకు రెండు కోట్ల 72 లక్షల రూపాయలతో నిర్మించిన రోడ్డు పనులకు ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, జడ్పీ ఛైర్ పర్సన్ తీగల అనిత రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం చేవెళ్లలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, మోడల్ స్కూల్ వద్ద సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం చేవెళ్ల గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని పరిశీలించారు.
చేవెళ్లలో పర్యటించిన మంత్రి సబితా... పలు అభివృద్ధి పనులకు శ్రీకారం - chevalla news
చేవెళ్లలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. అనేక కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన రోడ్లు, విస్తరణ పనులు చేపడుతోందని మంత్రి తెలిపారు.
చేవెళ్లలో పర్యటించిన మంత్రి సబితా... పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
రాష్ట్రంలో 158 రోడ్లకు గాను రూ.658 కోట్లు మంజూరయ్యాయని మంత్రి తెలిపారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా నూతన రోడ్లు, విస్తరణ పనులు చేపడుతున్నామని వెల్లడించారు.
ఇదీ చూడండి:'వరంగల్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది'