రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీలో మజ్లిస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. జల్పల్లి పురపాలికలోని షాహీన్‌నగర్‌లో జరిగిన బహిరంగ సభకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ హాజరయ్యారు.
కేసీఆర్.. కేరళ సర్కారులా మీరూ 'సుప్రీం'కెళ్లండి: అసదుద్దీన్
పుర ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీలో మజ్లిస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అసదుద్దీన్ ఒవైసీ హాజరయ్యారు. ఎంఐఎం అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
'భాజపా కావాలనే పేదవారిని ఇబ్బందులకు గురి చేస్తోంది'
కేరళ ప్రభుత్వం తరహా తెలంగాణ సర్కారు కూడా ఆర్టికల్ 131ను ఉపయోగించి కోర్టుకు వెళ్లాలని అసదుద్దీన్ విజ్ఞప్తి చేశారు. భాజపా ప్రభుత్వం కావాలనే పేద వారిని ఇబ్బందులకు గురి చేస్తోందని ఆయన ఆరోపించారు. పుర ఎన్నికల్లో పోటీచేస్తున్న ఎంఐఎం అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఇవీ చూడండి: కాంగ్రెస్ సవాల్‌ని స్వీకరిస్తున్నా... పుర ప్రచారానికి 'బయటికి' రాను!