తెలంగాణ

telangana

ETV Bharat / state

రామోజీ ఫిల్మ్‌సిటీలో ఘనంగా మార్గదర్శి చిట్​ఫండ్స్​ 60 వసంతాల సంబురాలు - Margadarshi Chitfund MD Shailaja Kiran latest news

అన్నివర్గాల ప్రజల ఆర్థిక ఆశలకు వారధిగా నిలుస్తూ.. లక్షల మంది జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపిన 'మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థ'.. 60 వసంతాలు పూర్తి చేసుకుంది. ఆరు దశాబ్దాల సుధీర్ఘ చరిత్రలో 60 లక్షల మందికి పైగా ఖాతాదారులకు సేవలందిస్తూ చిట్‌ఫండ్‌ రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. వినియోగదారులే దేవుళ్లని, వారు దాచుకున్న డబ్బు భద్రతే లక్ష్యంగా.. నిత్యం పనిచేస్తున్న 'మార్గదర్శి సంస్థ'.. 60 వసంతాల సంబురాలు రామోజీ ఫిల్మ్‌సిటీలో ఘనంగా జరిగాయి.

Margadarshi Chitfund
Margadarshi Chitfund

By

Published : Oct 1, 2022, 3:36 PM IST

Updated : Oct 1, 2022, 4:22 PM IST

రామోజీ ఫిల్మ్‌సిటీలో ఘనంగా మార్గదర్శి చిట్​ఫండ్స్​ 60 వసంతాల సంబురాలు

'నేనూ మార్గదర్శిలో చేరాను.. ఓ మోపెడ్‌ కొనుక్కున్నాను' అంటూ.. తెలుగువారికి సుపరిచితమైన సంస్థ మార్గదర్శి చిట్‌ఫండ్‌ 60 వసంతాలు పూర్తి చేసుకుంది. 1962లో కేవలం ఇద్దరు ఉద్యోగులతో మొదలై.. ప్రస్తుతం 4,300 మంది సిబ్బంది, 108 బ్రాంచ్‌లతో అగ్రగామి సంస్థగా రూపుదిద్దుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు.. తమిళనాడు, కర్ణాటకల్లోనూ మంచి పేరు సంపాదించుకుంది.

వినియోదారులే దేవుళ్లు అన్న నినాదంతో అన్నివర్గాల ఆశలకు మార్గదర్శకత్వం చేసేలా ఉండాలన్న లక్ష్యంతో.. రామోజీరావు ఏర్పాటు చేసిన సంస్థ ఆరు దశాబ్దాలుగా దాదాపు 60 లక్షల మంది కస్టమర్లకు సేవలు అందించింది. 60 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని.. రామోజీ ఫిల్మ్‌సిటీలో వార్షికోత్సవ సంబురాలను ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకలో రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌, ఈనాడు ఎండీ సీహెచ్‌ కిరణ్‌, ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరీ.. రామోజీరావు కుటుంబసభ్యులు, మార్గదర్శి వైస్ ప్రెసిడెంట్స్ రాజాజీ, వెంకటస్వామి, బలరామ కృష్ణ, సాంబమూర్తి, మల్లికార్జున రావు, బ్రాంచ్ మేనేజర్లు పాల్గొన్నారు.

ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్రలో 60 లక్షల మందికి పైగా వినియోగదారులకు సేవలందించిన మార్గదర్శి ప్రస్థానాన్ని వార్షికోత్సవ కార్యక్రమంలో దృశ్యరూపకంగా ప్రదర్శించారు. మార్గదర్శి చిట్‌ఫండ్ 61వ ఏడాదిలోకి అడుగుపెట్టిన వేళ రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు కేక్‌ కోసి.. ఈ విజయ ప్రస్థానంలో భాగస్వామ్యులైన సిబ్బందికి, వినియోగదారులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతనోత్సాహంతో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

మార్గదర్శి ప్రస్థానంలో అడుగడుగునా వెన్నంటి నిలిచి నిత్యం ప్రోత్సాహం అందిస్తున్న ఛైర్మన్‌ రామోజీరావుకు.. మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని కొత్త బ్రాంచ్‌లతో మరింత మందికి సేవలు అందించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌ వివరించారు.

ఇవీ చదవండి:'99 శాతం రికవరీ రేటు.. ఈ ఏడాది రూ.12 వేల కోట్ల టర్నోవర్​ సాధిస్తాం'

దేశంలో విశిష్ట చేనేత సంప్రదాయ వస్త్రాల్లో మూడు మనవే!

దేశంలో నాలుగో పారిశ్రామిక విప్లవం.. 5జీ సేవలు ప్రారంభించిన ప్రధాని

Last Updated : Oct 1, 2022, 4:22 PM IST

ABOUT THE AUTHOR

...view details