Many Doubts In Hayatnagar Rajesh Murder case : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో గత ఫిబ్రవరిలో కలకలంరేపిన యువకుడి హత్యోందం మరువకముందే అదే మార్గంలో మరో ఘటన చోటుచేసుకుంది. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల డాక్టర్స్ కాలనీలో ప్రికాస్టింగ్ వేసిన ఓ ప్లాట్‌లో ఉదయం దుర్వాసన రావటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఒంటిపై దుస్తులు లేని స్థితిలో ఉన్న మృతదేహం వద్ద ఆధారాలు సేకరించిన పోలీసులు.. ఘటనాస్థలంలో లభ్యమైన సెల్‌ఫోన్, పర్సులో ఉన్న వివరాలతో మృతుడు ములుగు జిల్లాకు చెందిన రాజేశ్‌గా గుర్తించారు.
నగర శివారులోని కుంట్లూరు ప్రాంతంలో కుళ్లిపోయిన స్థితిలో లభించిన మృతదేహం కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఉదయం 8గంటల సమయంలో స్థానికులు కుళ్లిపోయిన స్దితిలో మృతదేహం కనిపించడంతో హయత్‌నగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దాదాపు మూడు రోజుల క్రితం హత్యకు గురైనట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.
Rajesh Murder case In Kuntloor : మృతిచెందిన యువకుడు ములుగు జిల్లా చెందిన పరమేశులు, విజయ దంపతుల పెద్ద కుమారుడు రాజేశ్‌గా గుర్తించారు. 2021లో ఇబ్రహీంపట్నం సమీపంలోని శేరిగూడలో గల శ్రీఇందూ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేసిన రాజేశ్...ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇదే క్రమంలో ఈనెల 20న నగరానికి వచ్చాడు. తన చిన్ననాటి స్నేహితుడు చైతన్యపురి లోని ఓ వసతి గృహంలో ఉంటున్న సాయి ప్రకాశ్ వద్దకు వచ్చాడు. రెండు రోజుల పాటు తన వద్దనే ఉంటానని రాజేశ్ సాయిప్రకాశ్కు చెప్పాడు. ఈనెల 21 ఇబ్రహీంపట్నంలోని తాను చదివిన కళాశాలలో పని ఉందని వెళ్లి వస్తానని సాయి ప్రకాశ్‌కు చెప్పాడు. రాత్రి వరకూ రాకపోవడంతో సాయి రాజేశ్‌కు ఫోన్ చేశాడు. వస్తానని చెప్పాడు కానీ...తిరిగి రాలేదని పోలీసులకు సాయిప్రకాశ్ తెలిపాడు. 24వరకూ సాయి ప్రకాశ్‌తో ఫోన్లో స్పందించిన రాజేశ్ ఆ తర్వాత స్పందించలేదు. ఈ విషయాన్ని సాయిప్రకాశ్ పోలీసులకు చెప్పాడు. అతని చెప్పిన సమాచారంతో పాటు సెల్‌ఫోన్ సిగ్నల్, కాల్ డేటా ఆధారంగా మరుసటి రోజు హయత్‌నగర్‌లో తెలిసిన వారి వద్దకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. వారి వివరాలు సేకరించి విచారిస్తున్నారు. దీంతో పాటు కాల్ డేటా ఆధారంగా రాజేష్ ఎవరిని కలిశాడు, ఏఏ ప్రాంతాలకు వెళ్లాడని దర్యాప్తు చేస్తున్నారు.
ఒక మహిళతో ఫోన్లో :పోలీసుల సమాచారంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు హయత్‌నగర్‌కు చేరుకున్నారు. ఉద్యోగంతో వస్తానన్న కుమారుడు దారుణంగా హత్య చేయబడటంతో కన్నీరుమున్నీరయ్యారు. అభంశుభం ఎరుగని తన కుమారుడిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాజేశ్ మృతి కేసులో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. రాజేశ్ కాల్ డేటా ను పరిశీలించినపుడు ఏలూరుకి చెందిన ఒక మహిళతో ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించారు. మహిళకు పోలీసులు ఫోన్ చేయగా...తనకు రాజేశ్ తెలియదంటూ సమాధానం ఇచ్చినట్లు సమాచారం. కేసును దర్యాప్తు చేసి త్వరలోనే నిందితులను పట్టుకుంటామని వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తమ్ రెడ్డి వెల్లడించారు.
ఇవీ చదవండి: