ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానాలను ప్రభుత్వం క్రమంగా నెరవేరుస్తుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో 2.63 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. కిస్మత్‌పూర, బండ్లగూడ గ్రామాలలో ఓపెన్ జిమ్‌ను ప్రారంభించారు. హిమాయత్ సాగర్, కిరణ్ చెరు ప్రాంతాల్లో సీసీ రోడ్ల అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజలు ప్రతి సమస్యను తన దృష్టికి తెచ్చిన వెంటనే సమస్యను తీర్చేందుకు ప్రయత్నిస్తానని ప్రకాష్ గౌడ్ అన్నారు.
'ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తా'
రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని తమ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానాలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ వెల్లడించారు. 2.63 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
'ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేస్తా'