రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 91,350 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 424 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులు 6లక్షల 53వేల 626కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
TS corona cases: రాష్ట్రంలో కొత్తగా 424 కొవిడ్ కేసులు, 2మరణాలు - corona cases in telangana
రాష్ట్రంలో గడిచిన 24గంటల వ్యవధిలో కొత్తగా 424 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. మహమ్మారి బారిన పడి ఇద్దరు మరణించారు. కరోనా నుంచి కొత్తగా 449మంది కోలుకున్నారు.
తెలంగాణలో కరోనా కేసులు
24 గంటల వ్యవధిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,849కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 449 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య 6,42,865కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 6,912 యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.
ఇదీ చదవండి:Arun Haldar: 'ఎస్సీ మహిళలపై దాడి జరిగినా.. తాత్సారం చేస్తున్నారు'