రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తక్కళ్లపల్లి గేట్ వద్ద సాగర్ రహదారి సమీపంలో కృష్ణా జలాల ప్రధాన పైప్ లైన్ పేజ్-2 జాయింట్ వద్ద లీకేజీ ఏర్పడింది. భారీ ఎత్తున మంచినీరు వృథాగా పోతోంది. నాగార్జునసాగర్ నుండి హైదరాబాద్‌కు వెళ్లే కృష్ణా తాగునీరు లీకేజీలతో వృథాగా పోతున్నా జలమండలి అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రధాన పైపులైన్‌కు రెండు చోట్ల లీకేజీలు ఏర్పడ్డాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి లీకేజీలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
నిర్లక్ష్యం విలువ... వేల బిందెల నీరు వృథా - లీకేజీలతో వృధా
ఒకవైపు వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే... మరొక వైపు గుక్కెడు మంచి నీటి కోసం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇదిలా ఉండగా కృష్ణా జలాల ప్రధాన పైప్ లైన్ లీకేజీ ఏర్పడి విలువైన తాగు నీరు వృథాగా పోతున్నది.
నిర్లక్ష్యం విలువ... వేల బిందెల నీరు వృథా