కొవిడ్ ఐసోలేషన్ సెంటర్‌ను (Isolation Center) పేదప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి(Konda Vishweshwar Reddy) కోరారు. చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలో పేద ప్రజలకు కరోనా చికిత్స అందించాలనే ఉద్దేశంతో స్థానికంగా ఉన్న ప్రగతి భవన్‌ను 10 పడకల ఉచిత సెంటర్‌గా మార్చామని చెప్పారు. కరోనా బారిన పడిన పేద ప్రజలందరూ లక్షలాది రూపాయలు పెట్టి చికిత్స చేసుకోవడం భారంగా మారిన తరుణంలో ఉచితంగా కొవిడ్ సెంటర్ ఏర్పాటు చేశామని తెలిపారు.
Isolation Center: 'ఐసోలేషన్ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలి'
కరోనా ఐసోలేషన్ సెంటర్(Isolation Center)ను పేదలు సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి(Konda Vishweshwar Reddy) కోరారు. కరోనా బారిన పడిన పేదప్రజలు కొవిడ్ సెంటర్లో చికిత్స పొందాలని సూచించారు.
కరోనా ఐసోలేషన్ సెంటర్, కొవిడ్ ఐసోలేషన్ సెంటర్, చేవెళ్లలో కరోనా ఐసోలేషన్ సెంటర్
ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి సూచించారు. లాక్డౌన్ సమయంలో బయటకు రాకుండా పోలీసులకు సహకరించాలని కోరారు.