ప్రభుత్వ, భూదాన్ భూముల్లో నివాసం ఉంటున్న పేద ప్రజలకి నివాస పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం జీవో తెచ్చిందనీ, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రజలకి సూచించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ కుంట్లూరులో ఉన్న 99, 100 సర్వే నంబర్లలో పర్యటించిన ఆయన.. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ భూముల్లోని నివాసాలకు ఇళ్ల పట్టాలు: ఎమ్మెల్యే మంచిరెడ్డి
ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న పేద ప్రజలకి ప్రభుత్వం తీపి కబురునిచ్చిందని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలోని కుంట్లూరులో 99, 100 సర్వే నంబర్లలో ఆయన పర్యటించారు. గత 15 ఏళ్లుగా నివాసం ఉంటున్న వారు తమ ఇంటిని క్రమబద్ధీకరించుకునే అవకాశం వచ్చిందని తెలిపారు.
గత 15, 20 ఏళ్లుగా నివాసం ఉంటున్న ప్రజలకి సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారని ఎమ్మెల్యే అన్నారు. ఈ నెల 1 నుంచి 15 లోపు ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించుకుని ఉంటున్న కుటుంబాలు పూర్తి సమాచారంతో దరఖాస్తు చేసుకుని తమ ఇంటిని క్రమబద్ధీకరించుకోవాలని కోరారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న 4 మున్సిపాలిటీల్లో ఈ స్కీము ద్వారా దాదాపు 11 వేల మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. స్థానికంగా ఉన్న కౌన్సిలర్లు ఈ స్కీం గురించి ప్రజలకి అవగాహన కల్పించాలని కిషన్ రెడ్డి చెప్పారు.
ఇదీ చదవండి:కొవిడ్ నిబంధనలతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక