గర్భవతిగా ఉన్న ఓ మహిళ తన ఆరోగ్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్ దిల్సుఖ్నగర్లోని గైనకాలజీకి సంబంధించిన వైద్యురాలిని సంప్రదించారు. కడుపులో ఉన్న బిడ్డ కదలికలపై స్కా నింగ్ చేయాలని సూచించగా.. రాజేంద్రనగర్లోని ఓ మల్టి స్పెషలిటీ ఆస్పత్రి వైద్యుల వద్దకు వెళ్లారు. వైద్యులు లింగనిర్ధరణ పరీక్షలు చేస్తుండగా అక్కడే ఉన్న రాచకొండ షీ టీమ్ బృందం వైద్యులను అదుపులోకి తీసుకుంది. అనంతరం ఆస్పత్రిని సీజ్ చేశారు. సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని చైతన్యపురి పోలీసులను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఆదేశించారు.
లింగ నిర్ధరణ చేసిన ఆస్పత్రి సీజ్ - hospital size at rajendranagar in rangareddy district
లింగ నిర్ధరణ పరీక్ష చేస్తున్న ఆస్పత్రిపై రాచకొండ షీ టీమ్ డెకాయి ఆపరేషన్ నిర్వహించి.. సీజ్ చేసిన ఘటన రాజేంద్రనగర్లో జరిగింది. పోలీసులు వైద్యులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
లింగ నిర్ధరణ చేసిన ఆస్పత్రి సీజ్