తెలంగాణ

telangana

ETV Bharat / state

Hyderabad Rains: లోతట్టు ప్రాంతాలు జలమయం.. ఇంకెన్నాళ్లీ హైదరా'బాధలు'!! - Hyderabad rains 2021

హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. రెండు గంటలపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జీహెచ్ఎంసీ మాన్‌నూన్‌ టీంలు రంగంలోకి దిగి నీరు నిలిచిన ప్రాంతాల్లో చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్​ను క్లియర్ చేశారు. ఒక్కసారిగ వర్షం భారీగా కురవడంతో డ్రైనేజీలు, నాలాలు పొంగిపొర్లుతున్నాయి.

లోతట్టు ప్రాంతాలు జలమయం
లోతట్టు ప్రాంతాలు జలమయం

By

Published : Sep 3, 2021, 2:15 PM IST

Updated : Sep 3, 2021, 2:20 PM IST

గ్రేటర్ పరిధిలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. రాత్రి 7.50 గంటలకు ప్రారంభమైన వర్షం ఏకధాటిగా రెండు గంటలపాటు కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, అమీర్‌పేట, మైత్రివనం, ఎర్రగడ్డ, శ్రీనగర్ కాలనీ, రాజ్​భవన్ రోడ్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్, ఖైరతాబాద్, హబ్సిగూడా, టోలిచౌకి ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి.

లోతట్టు ప్రాంతాలు జలమయం

నగరమంతా జలమయం

ఎస్సార్ నగర్, ఖైరతాబాద్, కోఠి, దిల్‌సుఖ్​నగర్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, అల్విన్ కాలనీ, బాలానగర్, నాచారం, మల్లాపూర్, తార్నాక, ఉప్పల్‌లో ఏకధాటిగా వర్షం కురిసింది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, డ్రైనేజీలు, నాలాలు పొంగిపొర్లాయి. రోడ్లన్నీ చెరువులను తలపించాయి. దీంతో నగరంలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. యూసుఫ్​గూడ, శ్రీకృష్ణ నగర్​లో వరద నీటిలో కొట్టుకుపోతున్న ద్విచక్ర వాహనాన్ని స్థానికులు కాపాడారు.

జలమయమైన కాలనీలు

కొట్టుకుపోయిన బండ్లు

కృష్ణానగర్​లో భారీవర్షానికి వచ్చిన నీటిలో తోపుడు బండ్లు కొట్టుకుపోయాయి. కుత్బుల్లాపూర్, జీడిమెట్ల జగద్గిరిగుట్ట, సూరారం, కూకట్‌పల్లి, నిజాంపేట్, ప్రగతి నగర్, కేపీహెచ్​బీ కాలనీ, హైదర్​నగర్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. మాదాపుర్ శిల్పారామం సమిపంలో ప్రధాన రహదారిపై భారీగా వరదనీరు వచ్చి చేరింది. మాదాపుర్ కోండాపుర్ మార్గంలో ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. జీహెచ్ఎంసీ మాన్​సూన్ టీంలు రంగంలోకి దిగి... నీరు నిలిచిన ప్రాంతాల్లో వాటిని పంపించారు.

కాలనీల్లో వరద బీభత్సం

కర్మాన్​ఘాట్ ఉదయనగర్‌ కాలనీలో గతంలో ఎన్నడు లేని విధంగా వర్షం కురిసిందని రిటైర్డ్ ఇంజినీర్ అశోక్ తెలిపారు. ఇరిగేషన్ ఎక్సెస్ నీటిని డొమెస్టిక్ లైన్‌తో కలపడంతో తమ కాలనీకి గత రెండు సంవత్సరాలుగా ముంపు ప్రమాదం ఏర్పడిందని తెలిపారు.

అత్యధికంగా... జూబ్లీహిల్స్ ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ 9.78 సెంటీమీటర్లు, అల్లాపూర్ వివేకానంద్ నగర్ 9.6, మాదాపూర్‌లో 8.75, మోతీనగర్‌లో 7.98, విరాట్ నగర్ 7.93, యూసఫ్​గూడ 7.63, బాలానగర్‌లో 7.15 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ఫాతిమానగర్ 6.53, ఇందిరానగర్ కమ్యూనిటీ హాల్ 5.98, హస్తినాపురం కమ్యూనిటీ హాల్ 5.95, కుత్బుల్లాపూర్, రంగారెడ్డినగర్ 5.93, జీడిమెట్ల 5.65, కేపీహెచ్​బీ సీబీ సీఐడీ కాలనీ 5.68, ఆసీఫ్​నగర్ 5.65, షాపూర్​నగర్ 5.48, కూకట్​పల్లి 5.45, బంజారాహిల్స్ వెంకటేశ్వర కాలనీ 5.35, టోలీచౌక్ 5.25, వనస్థలిపురం 5.18 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది.

  • నగరంలో వర్షాపాతం వివరాలు ఇలా....
ప్రాంతం వర్షపాతం వివరాలు
జూబ్లిహిల్స్ ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ 9.78 సెంటీమీటర్లు
అల్లాపూర్ వివేకానంద్ నగర్ 9.6 సెంటీమీటర్లు
మాదాపూర్‌ 8.75సెంటీమీటర్లు
మోతీనగర్‌ 7.98సెంటీమీటర్లు
విరాట్ నగర్ 7.93సెంటీమీటర్లు
యూసఫ్​గూడ 7.63సెంటీమీటర్లు
బాలానగర్‌ 7.15సెంటీమీటర్లు
ఫాతిమానగర్ 6.53సెంటీమీటర్లు
ఇందిరానగర్ కమ్యూనిటీ హాల్ 5.98సెంటీమీటర్లు
హస్తినాపురం కమ్యూనిటీ హాల్ 5.95సెంటీమీటర్లు
కుత్బుల్లాపూర్ 5.93సెంటీమీటర్లు
రంగారెడ్డినగర్ 5.93సెంటీమీటర్లు
జీడిమెట్ల 5.65సెంటీమీటర్లు
కేపీహెచ్​బీ సీబీ సీఐడీ కాలనీ 5.68సెంటీమీటర్లు
ఆసీఫ్​నగర్ 5.65సెంటీమీటర్లు
షాపూర్​నగర్ 5.48సెంటీమీటర్లు
కూకట్​పల్లి 5.45సెంటీమీటర్లు
బంజారాహిల్స్ వెంకటేశ్వర కాలనీ 5.35సెంటీమీటర్లు
వనస్థలిపురం 5.18 సెంటీమీటర్లు
Last Updated : Sep 3, 2021, 2:20 PM IST

ABOUT THE AUTHOR

...view details