తెలంగాణ

telangana

ETV Bharat / state

పాత్రికేయులకు నిత్యావసర సరకులు పంపిణీ - GROCERIES DISTRIBUTION TO JOURNALISTS BY IBHRAHIMPATNAM MLA KISHAN REDDY

ఇబ్రంహీం పట్నం నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో పాత్రికేయులకు నిత్యావసర వస్తువులను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​ రెడ్డి పంపిణీ చేశారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని ఆయన సూచించారు.

పత్రికా విలేకరులకు బియ్యం పంపిణీ
పత్రికా విలేకరులకు బియ్యం పంపిణీ

By

Published : Apr 9, 2020, 10:41 AM IST

ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించి, కరోనా వైరస్​ను తరిమికొట్టాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. పాత్రికేయులకు 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అందించారు. రంగారెడ్డి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్, ఇబ్రహీంపట్నం పురపాలక సంఘం వైస్ ఛైర్మన్ ఆకుల యాదగిరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం మండలాల్లోని పాత్రికేయులందరికీ నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు.

ప్రతి ఒక్కరూ ఇంట్లోనే...

ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో వంట నూనె, కిలో పిండి, కిలో చక్కెరను ఎమ్మెల్యే అందజేశారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి ప్రభుత్వం విధించిన లాక్ డౌన్​ను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సహకరించి ఇంట్లోనే ఉండాలని కోరారు. కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దయాకర్ రెడ్డి, ఏసీపీ యాదగిరిరెడ్డి , పురపాలక సంఘం ఛైర్ పర్సన్ కప్పిరి స్రవంతి, కమిషనర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : రాష్ట్రంలో 453కు పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

ABOUT THE AUTHOR

...view details