రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో అపహరణకు గురైన నాలుగేళ్ల చిన్నారి కథ సుఖాంతమైంది. దిశ ఘటన జరిగిన చటాన్ పల్లిలోనే ఈ ఘటన జరగడంతో అప్రమత్తమైన పోలీసులు.. సీసీటీవీ దృశ్యాల ద్వారా ముమ్మరంగా దర్యాప్తు చేశారు.
చిన్నారిని కిడ్నాప్ చేశాడు..పోలీసులకు లొంగిపోయాడు.. - GIRL KIDNAPPED IN SHADNAGAR
షాద్‌నగర్‌లో అపహరణకు గురైన నాలుగేళ్ల చిన్నారి కథ సుఖాంతమైంది. ఎత్తుకెళ్లిన వ్యక్తే... చిన్నారిని తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు.
చిన్నారిని కిడ్నాప్ చేశాడు..పోలీసులకు లొంగిపోయాడు..
చటాన్‌పల్లికి చెందిన చిన్నారి షాద్‌నగర్ పబ్లిక్ పాఠశాలలో ఎల్కేజీ చదువుతోంది. పాఠశాల నుంచి వచ్చి ఇంటిముందు ఆడుకుంటుండగా ద్విచక్రవాహనంపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి... చిన్నారికి చాక్లెట్ ఇస్తానని చెప్పి తీసుకెళ్లాడు.
అపహరించిన వ్యక్తే చిన్నారిని తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు వచ్చారు.
- ఇదీ చూడండి:'పేసా'తో భారత ఆర్థిక సేవల రంగంలోకి రియల్మీ
TAGGED:
GIRL KIDNAPPED IN SHADNAGAR