మత్స్యకారుల హక్కుల సాధన కోసం.. హైదరాబాద్‌లో ఈ నెల 28న 'గంగపుత్ర మహా గర్జన' సభను నిర్వహిస్తున్నట్లు.. గంగపుత్ర మహిళా సంఘం అధ్యక్షురాలు అరుణా జ్యోతి తెలిపారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో జరగబోయే సభకు.. గంగపుత్రులు భారీగా తరలి రావాలని కోరారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌లోని గండి మైసీ అమ్మవారిని ఆమె దర్శించుకున్నారు.
28న ఇందిరాపార్క్‌లో గంగపుత్ర మహా గర్జన సభ - మత్స్య సొసైటీలు
మత్స్యకారులంతా ఐక్యంగా ఉంటే.. హక్కులను సాధించుకోవచ్చునని గంగపుత్ర మహిళా సంఘం అధ్యక్షురాలు అరుణా జ్యోతి అన్నారు. సమస్యల పరిష్కారానికి హైదరాబాద్‌లో ఈ నెల 28న 'గంగపుత్ర మహా గర్జన' సభను నిర్వహిస్తున్నట్లు.. ఆమె తెలిపారు.
28న ఇందిరాపార్క్‌లో గంగపుత్ర మహా గర్జన సభ
మత్స్య సొసైటీలను పరిరక్షించాలని అరుణా జ్యోతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గంగపుత్రులంతా ఐక్యంగా ఉంటే.. హక్కులను సాధించుకోవచ్చునని వివరించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి:పండిస్తే ఆదాయం.. తింటే ఆరోగ్యం