తెలంగాణ

telangana

ETV Bharat / state

భూ నిర్వాసితుల ధర్నా - FORMERS PROTEST

రంగారెడ్డి జిల్లాలో భూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. హార్డ్​వేర్ పార్క్ కోసం భూములు కోల్పోయిన రైతులకు కాకుండా వేరే వ్యక్తుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయని ఆరోపిస్తూ చేవెళ్లలో ధర్నా నిర్వహించారు.

పరిహారమేది...?

By

Published : Mar 6, 2019, 9:57 PM IST

పరిహారమేది...?
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో రైతులు ఆందోళన చేపట్టారు. హార్డ్​వేర్ పార్క్ కోసం తీసుకున్న భూమి యజమానులను కాదని, సంబంధం లేని వ్యక్తులకు పరిహారం చెల్లించారని ఆరోపిస్తూ చేవెళ్లలోని ఆర్.డి.వో కార్యాలయాన్ని ముట్టడించారు. చందనపల్లి గ్రామంలో 786 ఎకరాల భూమిని ప్రభుత్వం రైతులకు పంపిణీ చేసింది. అనంతరం స్వల్ప వ్యవధిలోనే పరిశ్రమల కోసం స్వాధీనం చేసుకుంది.
కబ్జాలో ఉన్న రైతులకు 2013 చట్టం ప్రకారం పరిహారం చెక్కులు పంపిణీ చేయాల్సిందిపోయి వేరే వారికి ఇచ్చారు. ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, అధికారులు కుమ్మక్కై సంబంధం లేని వారి పేర్లతో కోట్ల రూపాయలు డ్రా చేశారని రైతులు ఆరోపించారు. అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోవడంతో ధర్నా చేశారు. ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే నరసింహులు, సీపీఎం నాయకులు ధర్నాలో పాల్గొన్నారు.

ఇవీ చూడండి:మళ్లీ మోదీనే...

ABOUT THE AUTHOR

...view details