రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో వరద బాధితులు ఆందోళనకు దిగారు. మీర్పేట్ నగరపాలక సంస్థ కార్యాలయం ముందు భాజపా నాయకుల ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
భాజపా ఆధ్వర్యంలో వరద బాధితుల ధర్నా - వరద బాధితుల ధర్నా
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద వరద బాధితులు ఆందోళన చేపట్టారు. భారీ వర్షాల వల్ల నష్టపోయిన ముంపు కాలనీల ప్రజలకు పదివేలు సాయం అందించాలంటూ భాజపా నాయకులు రోడ్డుపై బైఠాయించారు.
భాజపా ఆధ్వర్యంలో వరద బాధితుల ధర్నా
భారీ వర్షాల వల్ల నిత్యావసరాలు తడిసిపోయి ఇబ్బందులు పడుతున్న తమకు పదివేల రూపాయల వరద సాయం అందించాలని ధర్నా నిర్వహించారు. తెరాస కార్యకర్తలకు మాత్రమే సాయం అందిస్తున్నారని, నిజమైన బాధితులకు పరిహారం ఇవ్వడం లేదని భాజపా నాయకులు విమర్శించారు. తక్షణమే బాధితులకు సాయం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.