FCI On Rabi Paddy Procurement : యాసంగి కోటాలో మిగిలిన బియ్యంలో సగం.. పోషకాలు మిళితం చేసిన బలవర్ధక ఉప్పుడు బియ్యం (ఫోర్టిఫైడ్ బాయిల్డు రైస్) రూపంలోనే ఇవ్వాలని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ).. రాష్ట్రానికి స్పష్టం చేసింది. గత యాసంగిలో ఉప్పుడు బియ్యం తీసుకునే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వాడీవేడీ చర్చలు జరిగిన విషయం తెలిసింది. రాష్ట్రం నుంచి 24.75 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యం మాత్రమే తీసుకుంటామని, మిగిలిన మొత్తం సాధారణ బియ్యం రూపంలో ఇవ్వాలని కేంద్రం కోరింది.
FCI Clarifies about Paddy Purchase : రాష్ట్రంలో యాసంగిలో పండే ధాన్యాన్ని సింహభాగం ఉప్పుడు బియ్యంగానే మారుస్తారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టుపట్టడంతో మరో 20 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యం తీసుకునేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రం నుంచి ఎఫ్‌సీఐకి 44.75 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యానికి గాను ఇంకా 5.65 లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సి ఉంది. అందులో పోషకాలు మిళితం చేసిన బియ్యం 50 శాతం ఇవ్వాలని ఎఫ్‌సీఐ 3-4 నెలల నుంచి రాష్ట్రానికి లేఖలు రాస్తోంది. మిల్లర్ల నుంచి పెద్దగా స్పందన లేకపోవటంతో వచ్చే వారం నుంచి రోజువారీగా 50 శాతం సాధారణ ఉప్పుడు బియ్యం, 50 శాతం బలవర్ధక ఉప్పుడు బియ్యాన్ని మాత్రమే తీసుకుంటామని తేల్చి చెప్పింది. పలు రాష్ట్రాల్లో రేషన్‌కార్డుదారులకు బలవర్ధక బియ్యం ఇవ్వాల్సి ఉన్న దృష్ట్యా వాటినే ఇవ్వాలని రాష్ట్రానికి రాసిన లేఖలో ఎఫ్‌సీఐ పేర్కొంది.
2024 నుంచి దేశవ్యాప్తంగా..