తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్యే కాన్వాయ్‌పై చెప్పులు, రాళ్లు విసిరిన రైతులు - MLA Manchireddy Kishan Reddy Latest News

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మేడిపల్లికి ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి రాకను నిరసిస్తూ రైతుల ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి వాహనంపై రాళ్లు, చెప్పులు విసిరారు. తాటిపర్తి సర్పంచ్ రమేశ్, వార్డు సభ్యులు, రైతులను పోలీసులు అరెస్టు చేశారు.

Farmers throwing sandals and stones at the MLA convoy
ఎమ్మెల్యే కాన్వాయ్‌పై చెప్పులు, రాళ్లు విసిరిన రైతులు

By

Published : Oct 15, 2020, 1:22 PM IST

రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఇబ్రంహీపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పర్యటన ఉద్రికత్తకు దారితీసింది. హైదారబాద్ ఫార్మాసీటికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్ని శాంతింపజేసేందుకు వచ్చిన ఎమ్మెల్యేకు.... రైతుల నుంచి నిరసన ఎదురైంది.

మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పర్యటనను నిరసిస్తూ... అన్నదాతలు నిరసనకు దిగారు. ఎమ్మెల్యే కాన్వాయ్‌కు అడ్డంగా రోడ్డుపై బైఠాయించిన రైతులు... వెనక్కి వెళ్లిపోవాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కారుపై చెప్పులు, రాళ్లు విసరడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారుల్ని నిలువరిచేందుకు పోలీసులు ప్రయత్నించారు.

ఒకదశలో పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో... తోపులాటకు దారితీసింది. స్వల్ప లాఠీఛార్జి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒకదశలో భీకర వాతావరణం నెలకొంది. మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. మరోవైపు ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి పర్యటనకు నిరసన తెలిపేందుకు బయలుదేరిన అఖిల భారత కాంగ్రెస్ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాటిపర్తి గ్రామ పంచాయతీ సర్పంచి రమేష్, పలువురు వార్డు సభ్యులు, రైతులను పోలీసులు అరెస్టు చేశారు.

ఎమ్మెల్యే కాన్వాయ్‌పై చెప్పులు, రాళ్లు విసిరిన రైతులు

ఇదీ చదవండి:విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి.. విషాదంలో కుటుంబీకులు

ABOUT THE AUTHOR

...view details