అన్నదమ్ముల మధ్య ఉన్న భూవివాదాన్ని పరిష్కరించాలని యాచారం మండలంలోని మాల్ గ్రామానికి చెందిన రైతు పాల వెంకటయ్య పోలీసులను ఆశ్రయించాడు. కానీ వివాదంలో ఉన్న రెండు ఎకరాల భూమిని...తనకు అమ్మాలంటూ యాచారం ఎస్.ఐ వెంకటయ్య బలవంతం చేస్తున్నాడని బాధిత రైతు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అందుకు నిరాకరించిన తనను బూటు కాళ్లతో తన్ని, అసభ్య పదజాలంతో దూషించాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయం పై ఊరి పెద్దలు జోక్యం చేసుకుని ఎస్.ఐని నిలదీసి... రాచకొండ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారన్నారు. అయితే ఆ భూమిని అమ్మినట్టు బాండ్ పేపర్ పై సంతకం చేయించాలని కమిషనర్ చెప్పినట్లు ఎస్సై బదులిచ్చారని తెలిపాడు. తనపై అక్రమ కేసులు పెట్టి తన కుటుంబాన్ని చిత్రహింసలకు గురి చేస్తానని బెదిరిస్తున్నాడని బాధితుడు వాపోయాడు. ఎస్.ఐ నుండి తమకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని రైతు మానవ హక్కుల కమిషన్‌ను వేడుకున్నాడు.
'భూమి అమ్మాలంటూ యాచారం ఎస్.ఐ బెదిరిస్తుండు' - complaint
రంగారెడ్డి జిల్లా యాచారం ఎస్.ఐ వెంకటయ్య వేధింపుల నుండి తమను కాపాడాలంటూ ఓ రైతు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశారు. భూవివాదాన్ని పరిష్కరించాలని ఆశ్రయిస్తే...తన కుటంబాన్ని చిత్రహింసలకు గురి చేస్తానని బెదిరిస్తున్నాడని బాధిత రైతు వాపోయాడు.
HRC