తెలంగాణ

telangana

ETV Bharat / state

చలివేంద్రాన్ని ప్రారంభించిన ఈటీవీ భారత్​ వైస్​ ప్రెసిడెంట్​ - etv news

హైదరాబాద్​ వనస్థలిపురంలోని సహారా కాంప్లెక్స్​లో గంగదాసు కృష్ణారెడ్డి ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఈటీవీ భారత్​ వైస్​ ప్రెసిడెంట్​ ప్రసేన్​జిత్​ రాయ్​ తమ చేతుల మీదుగా ప్రారంభించారు. ఎండాకాలంలో ప్రజల దాహార్తిని తీర్చడం గొప్ప కార్యక్రమమని ఆయన అన్నారు.

చలివేంద్రాన్ని ప్రారంభించిన ఈటీవీ భారత్​ వైస్​ ప్రెసిడెంట్​
చలివేంద్రాన్ని ప్రారంభించిన ఈటీవీ భారత్​ వైస్​ ప్రెసిడెంట్​

By

Published : Mar 27, 2022, 7:22 PM IST

Updated : Mar 27, 2022, 7:40 PM IST

తీవ్రమైన ఎండల్లో ప్రజల దాహం తీర్చేందుకు హైదరాబాద్​ వనస్థలిపురంలోని సహారా కాంప్లెక్స్​లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గంగదాసు కృష్ణారెడ్డి ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఈటీవీ భారత్​ వైస్​ ప్రెసిడెంట్​ ప్రసేన్​జిత్​ రాయ్​ తమ చేతుల మీదుగా ప్రారంభించారు. ఎండాకాలంలో ప్రజల దాహార్తిని తీర్చడం గొప్ప కార్యక్రమమని ఆయన అన్నారు.

ప్రజల దాహార్తిని తీర్చడం గొప్ప కార్యక్రమం: ఈటీవీ భారత్​ వైస్​ ప్రెసిడెంట్​

ఈ చలివేంద్రంలో రాగి జావతో పాటు మజ్జిగ కూడా ఏర్పాటు చేస్తున్నామని నిర్వాహకులు గంగదాసు కృష్ణారెడ్డి వెల్లడించారు. ఐదేళ్లుగా చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్న ఆయన.. గత ఏడాది కొవిడ్​ పరిస్థితుల దృష్ట్యా చేయలేదన్నారు.

కాలనీ వాసులతో ఈటీవీ భారత్​ వైస్​ ప్రెసిడెంట్​

ఈ కార్యక్రమంలో ఈటీవీ భారత్​ చీఫ్​ మేనేజర్​ శామ్స్​ నఖ్వీతో పాటు సామాజిక వేత్త దోసపాటి రాము అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రామోజీగ్రూప్​ ఉద్యోగి నవీ, కాలనీ ప్రెసిడెంట్​ సయ్యద్​ జానీ, జనరల్​ సెక్రటరీ సుదర్శన్​ రెడ్డి, ఎగ్జిక్యూటివ్​ కమిటీ సభ్యులు​ జగత్​ రెడ్డి, కాలనీ వాసులు విశ్వనాథం, అనంత్​ రెడ్డి, మహేంద్రా రెడ్డి, సౌభాగ్య లక్ష్మి పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

Last Updated : Mar 27, 2022, 7:40 PM IST

ABOUT THE AUTHOR

...view details