తెలంగాణ

telangana

ETV Bharat / state

CRPF: అంతర్గత భద్రతలో కీలకంగా సీఆర్పీఎఫ్ జవాన్లు

అడవిలో కూబింగ్ అయినా.. తీవ్రవాదులకోసం గాలింపైనా, ఎన్నికలైనా, అల్లర్లైనా... ఎక్కడ విధులు కేటాయిస్తే అక్కడ పని చేస్తారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొంటారు. వారే సీఆర్ఫీఎఫ్ జవాన్లు. దేశ అంతర్గత భద్రతలో సీఆర్పీఎఫ్ జవాన్లు సేవలు అత్యంత కీలకమైనవి. దేశవ్యాప్తంగా 243 బెటాలియన్లతో అత్యుత్తమ సేవలు అందిస్తున్న సీఆర్ఫీఎఫ్ జవాన్లపై స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

CRPF
సీఆర్ఫీఎఫ్ జవాన్లు

By

Published : Aug 14, 2021, 1:21 PM IST

CRPF: భారతమాత సేవలో తరిస్తున్న సీఆర్ఫీఎఫ్ జవాన్లు

తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాలకే లేస్తారు. మైదానంలోకి అడుగు పెడతారు. శారీరక దృఢత్వానికి వ్యాయామం చేస్తారు. మానసిక వికాసానికి యోగా కూడా చేస్తారు. శరీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతారు. విధులకు సిద్ధమవుతారు. మావోయిస్టులు, మిలటెంట్ల ఏరివేతకు సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రత్యేక శిక్షణ పొందుతారు. నడిచేందుకు కూడా సాధ్యం కాని కీకారణ్యాల్లో గాలింపు చేపడతారు.

రాణిస్తున్న మహిళలు

ఇన్ని సవాళ్లున్న ఈ దళంలో పురుషులతో పాటు మహిళలు సమర్ధవంతంగా రాణిస్తున్నారు. చిన్న చిన్న ఉద్యోగాలే కాకుండా పెద్ద స్థాయిల్లో పని చేస్తున్నారు. తమని చూసి మరింత మంది ముందుకు రావాలని వారు కోరుతున్నారు. యూనిఫామ్ ఉద్యోగాల్లో చేరాలనుకునే వారికి సీఆర్ఫీఎఫ్ మంచి అవకాశం అని మహిళా జవాన్లు చెబుతున్నారు.

దివ్యాంగులకు అండగా

దేశ అంతర్గత భద్రత విధుల్లో భాగంగా గాయపడి దివ్యాంగులుగా మారిన వారికి రంగారెడ్డిలోని ఈ గ్రూప్ సెంటర్​లో నేషనల్ దివ్యాంగ్ ఎంపవర్​మెంట్​ను ఏర్పాటు చేసి వారికి పారా క్రీడలతో పాటు వివిధ రంగాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తూ వారిలో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నారు. పారా క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే తమ లక్ష్యమని.. దివ్యాంగ జవాన్లు చెబుతున్నారు.

ఇదీ చదవండి:'పఠాన్‌కోట్‌ దాడికి స్థానిక పోలీసుల సాయం'!

ABOUT THE AUTHOR

...view details