రంగారెడ్డి జిల్లాలో విస్తారంగా కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగి పోర్లుతున్నాయి. జిల్లాలోని చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్, శంకర్ పల్లి మండలంలోని... ఈసీ, మూసి వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో వాగుల పక్కనే ఉన్న పంట పొలాలు నీట మునిగిపోయాయి. రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.
FLOODS: పొంగి పోర్లుతున్న వాగులు... నీట మునిగిన పంటలు - పొంగుతున్న వాగులు
విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పోర్లుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో పంట పొలాలు నీట మునిగి... రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. రహదారులపై నీరు చేరడంతో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి.
నీట మునిగిన పంటలు
ఏట్ల ఎర్రవల్లి, ప్రొద్దుటూరు, దేవరంపల్లి వాగులు పెద్ద ఎత్తున ప్రవాహిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇదీ చూడండి:hyderabad floods: సరూర్నగర్లో వరదలు.. ఇళ్లు వదిలివెళ్తున్న స్థానికులు