ఫీడ్ ది నీడ్ బృందానికి సైబరాబాద్ సీపీ సజ్జనార్ అభినందనలు తెలిపారు. కరోనా మృతితో చెందిన వారిని కన్నవారే పట్టించుకోని తరుణంలో వారి పార్థీవదేహాలను శ్మశాన వాటికలకు తరలిస్తూ అంతిమయాత్రలో ఆప్తులుగా మారారని మెచ్చుకున్నారు.
ఫీడ్ ది నీడ్ బృందానికి సీపీ సజ్జనార్ అభినందనలు - Feed the Need news
రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఫీడ్ ది నీడ్ సహకారంతో ఏర్పాటు చేసిన లాస్ట్ రైడ్ అంబులెన్స్ సేవలను సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రారంభించారు.
సీపీ సజ్జనార్
గచ్చిబౌలి సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఫీడ్ ది నీడ్ సహకారంతో ఏర్పాటు చేసిన లాస్ట్ రైడ్ అంబులెన్స్ సేవలను సీపీ సజ్జనార్ ప్రారంభించారు. గతేడాది జూలై 4న లాస్ట్‌రైడ్ పేరిట ఏర్పాటు చేసిన అంబులెన్స్ సేవలు తిరిగి సేవలు పునరుద్ధరించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఫీడ్ ది నీడీ బృందం సభ్యులు సాయితేజ, డీసీపీ విజయ్‌కుమార్, ఎస్‌సీఎస్‌సీ జనరల్ సెక్రెటరి కృష్ణ యేదుల, తదితరులు పాల్గొన్నారు.