వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో మొదటి రోజు 30 మంది వైద్య సిబ్బందికి కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా పాలనాధికారి హరీశ్ ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వారంలో నాలుగు రోజులు వైద్యసిబ్బందికి కరోనా టీకా ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
తొలిరోజు ముప్పై మంది వైద్య సిబ్బందికి టీకా: కలెక్టర్ - వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో కొవిడ్ టీకా పంపిణీ
హైదరాబాద్లోని వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్ ప్రారంభించారు. తొలిరోజు 30 మంది వైద్య సిబ్బందికి టీకా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం వారిని గంటసేపు వైద్యుల పర్యవేక్షణలో ఉంచామన్నారు.
కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వైద్యసిబ్బంది
వ్యాక్సిన్ ఇచ్చిన అనంతరం వారిని గంటసేపు వైద్యుల పర్యవేక్షణలో ఉంచామన్నారు. ఈ కార్యక్రమంలో హయత్నగర్ తహసీల్దార్ శైలజ, స్థానిక కార్పొరేటర్ ముద్దగోని లక్ష్మీప్రసన్న, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.