తెలంగాణ

telangana

ETV Bharat / state

అధికారం కోల్పోయిన ఇంకా ఆగని బీఆర్​ఎస్ నాయకుల కబ్జాలు : కొప్పుల నర్సింహా రెడ్డి

Corporator Koppula Narsimha Reddy comments on Brs Leaders : హయత్ నగర్​లో బీఆర్ఎస్ నాయకులు చెరువులను కబ్జా చేస్తున్నారని బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహా రెడ్డి ఆరోపించారు . సర్వే నెంబర్ 98, 99, 207లో ఉన్న హత్తిగూడ చెరువు ఎఫ్​టీఎల్ పరిధిలో ఉన్న ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని తెలిపారు. వీటితో పాటు జీవో నెంబర్ 58, 59తో ఇచ్చిన పట్టాలను రీసర్వే చేయించి వాటిలో ఉన్న ప్రభుత్వ స్థలాలను కాపాడాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.

Hayathnagar Government Place Occupied
Bjp Corporator Koppula Narsimha Reddy comments

By ETV Bharat Telangana Team

Published : Dec 13, 2023, 7:33 PM IST

Corporator Koppula Narsimha Reddy comments on Brs Leaders :మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్​లోని సర్వేనెంబర్ 98, 99, 207లో ఉన్న హత్తిగూడ చెరువు ఎఫ్​టీఎల్, పరిధిలో ఉన్న ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని జీహెచ్​ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహా రెడ్డిఆరోపించారు. ఆయన ఇవాళ కాలనీ సభ్యులతో కలిసి కబ్జాకు గురవుతున్న చెరువును పర్యవేక్షించారు. అనంతరం హయత్​నగర్ ఎమ్మార్వో బి.సునీతకు వినతి పత్రాన్ని అందజేశారు.

వర్షాకాల సమయంలో జాతీయ రహదారి వద్ద ఉన్న పుల్లా రెడ్డి స్వీట్స్ నుంచి శివారులో ఉన్న సుమారు 12 కాలనీలో నీట మునగకుండా హత్తిగూడ చెరువు ఎంతో ఉపయోగపడే విధంగా ఉండేదన్నారు. అంతేకాకుండా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడాఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రస్తుతం కబ్జాదారులు అవేమీ ఆలోచించకుండా చెరువు చుట్టుపక్కల మట్టితో పూడ్చేస్తున్నారని నర్సింహా రెడ్డి ఆరోపించారు.

Bjp Corporator Koppula Narsimha Reddy comments

Bjp Corporator Koppula Narsimha Reddy comments :తాను కార్పొరేటర్​గా గెలుపొందినప్పటి నుండి రెండున్నరేళ్లలో డివిజన్​లో ఉన్న చెరువులు కాపాడేందుకు రాత్రనకా, పగలనకా ఎంతో శ్రమిస్తున్నానని తెలిపారు. తనతో పాటు తమ పార్టీ కార్యకర్తలు కూడా చెరువులను కాపాడుతున్నారని కానీ కొందరు స్వార్థపరుల ధనదాహానికి ఇప్పుడా చెరువు కబ్జాకు గురవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న ఎమ్మార్వో సంధ్యారాణి, ఆర్డీవో వెంకటాచారి ప్రభుత్వ అధికారులై ఉండి కూడా ప్రభుత్వ స్థలాలను కాపాడకుండా, కబ్జాదారుల వద్ద కోట్ల రూపాయల లంచాలు తీసుకొని కబ్జాలను ప్రోత్సహించారని నర్సింహా రెడ్డి ఆరోపించారు.

Hayathnagar Government Place Occupied: అధికారులు ఇప్పటికైనా స్పందించి హత్తిగూడ చెరువు కబ్జాకు గురికాకుండా చేయాలని కోరారు. వీటితో పాటు జీవో నెంబర్ 58,59తో ఇచ్చిన పట్టాల స్థలాలను కూడా రీసర్వే చేయించి వాటిలో ఉన్న ప్రభుత్వ స్థలాలను కూడా కాపాడాలని విజ్ఞప్తి చేశారు. కబ్జాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే చెరువు వద్దనే నిరసన దీక్ష చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సభ్యులు, బీజేపీ నాయకులు, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మజ్లిస్​తో అంటకాగే ఏ పార్టీతో బీజేపీ కలిసి ముందుకు వెళ్లదు : రఘునందన్​ రావు

ABOUT THE AUTHOR

...view details