తెలంగాణ

telangana

ETV Bharat / state

వనస్థలిపురంలో తగ్గుముఖం పట్టిన కరోనా వ్యాప్తి - collector amai kumar

జీహెచ్ఎంసీ పరిధిలోని వనస్థలిపురంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గత రెండు రోజుల నుంచి కొత్త కేసులు నమోదు కాలేదని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షలు యథాతథంగా కొనసాగుతున్నాయన్నారు.

వనస్థలిపురంలో తగ్గుముఖం పట్టిన కరోనా వ్యాప్తి
వనస్థలిపురంలో తగ్గుముఖం పట్టిన కరోనా వ్యాప్తి

By

Published : May 10, 2020, 12:07 AM IST

రంగారెడ్డి జిల్లా జీహెచ్ఎంసీ పరిధిలోని వనస్థలిపురంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గత రెండు రోజుల నుంచి కొత్త కేసులు నమోదు కాలేదని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఈ డివిజన్ పరిధిలో 18 కేసులు నమోదు కాగా ఇద్దరు మరణించారు.

ప్రైమరీ, సెంకడరీ కాంటాక్ట్ వ్యక్తుల గుర్తింపు...

పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రైమరీ, సెంకడరీ కాంటాక్ట్ వ్యక్తులను గుర్తిస్తున్న అధికారులు వారందరిని క్వారంటైన్​కు తరలిస్తున్నారు. తాజాగా ఎస్​కేడీ నగర్​లో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తికి సెంకడరీ కాంట్టాక్​లో ఉన్న 8 మందిని గుర్తించారు. వారందరినీ అమీర్​పేటలోని నేచర్ క్యూర్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.

అక్కడ ఆంక్షలు యథాతథం...

మరోవైపు హోం క్వారంటైన్​లో ఉన్నవారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్న అధికారులు... దగ్గు, జలుబు, జ్వరం లాంటి అనారోగ్య సమస్యలున్నా.. గుర్తించి అప్రమత్తం చేస్తున్నారు. కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షలు యథాతథంగా కొనసాగుతున్నాయి.

ఇవీ చూడండి : లాక్​డౌన్​లోనూ రోడ్లపైకి భారీగా వాహనాలు

ABOUT THE AUTHOR

...view details