ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారులను సీఎం కేసీఆర్ మర్చిపోయారని ఏఐసీసీ కార్యదర్శి వంశీచందర్ రెడ్డి ఆరోపించారు. పట్టభద్రుల సమస్యలపై పోరాడే నాయకుడు కావాలంటే.. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. అనుభవజ్ఞుడైన చిన్నారెడ్డిని పెద్దల సభకు పంపాలని విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పరిధిలోని బొంగుళూరులో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పలువురు నేతలు పాల్గొన్నారు.
'ముందు హామీలు నెరవేర్చండి.. తర్వాతే ఓట్లు అడగండి' - నిరుద్యోగ భృతి
రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. పట్టభద్రుల సమస్యలపై పోరాడే నాయకుడు కావాలంటే.. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని నేతలు కోరారు.
'ముందు హామీలను నెరవేర్చండి.. తర్వాతే ఓట్లడగండి'
ఓడిపోయే సీటు పీవీ కుమార్తెకు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దని ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి గుర్తు చేశారు. నిరుద్యోగ భృతి, లక్ష ఉద్యోగాలు ఇస్తానన్న తెరాస.. హామీలను నెరవేర్చిన తర్వాతే ఓట్లు అడగాలని సూచించారు.
ఇదీ చదవండి:పట్టభద్రుల పోరులో అభ్యర్థుల ఓట్ల వేట