8 తులాల బంగారం, లక్ష ఇరవై వేల నగదు చోరీ...
రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శుభోదయనగర్ కాలనీలో రాత్రి చోరీ జరిగింది. ప్రసాద్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి తమ బంధువులు చనిపోతే దశదిన కర్మకు వెళ్లి తిరిగి ఈ రోజు ఉదయం వచ్చేసరికి ఇంటితాళం పగులగొట్టి ఉంది. ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు బీరువాలో ఉన్న 8 తులాల బంగారు ఆభరణాలు, ఒక లక్షఇరవై వేల నగదును అపహరించారు. హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని... క్లూస్ టీమ్‌తో దర్యాపు చేస్తున్నారు. సీసీ కెమెరాలలో నిక్షిప్తమైన దృశ్యాలను పరిశీలిస్తున్నారు.
Choori at Hayathnagar