చేవెళ్ల పార్లమెంట్ తెరాస అభ్యర్థి రంజిత్ రెడ్డి రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్దేవ్పల్లి, మధుబన్ కాలనీ, బాబుల్ రెడ్డి నగర్, పద్మశాలి పురం ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా పాల్గొన్నారు. ర్యాలీలో 1000 మందికి పైగా కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. తాను అధికారంలోకి వస్తే శంషాబాద్ ప్రాంతాల్లో ఉన్న జీవోను ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. 16 ఎంపీ స్థానాలు తెరాస గెలుచుకుంటే మన ప్రాజెక్టులకు జాతీయ హోదా తెచ్చుకోవచ్చని రంజిత్ రెడ్డి తెలిపారు.
ప్రచార వేగం పెంచిన చేవెళ్ల తెరాస అభ్యర్థి - TRS
ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ... తెరాస నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. చేవెళ్ల తెరాస ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు.
ప్రచార వేగం పెంచిన చేవెళ్ల తెరాస అభ్యర్థి