తెలంగాణ

telangana

ETV Bharat / state

రంగారెడ్డి జిల్లా కడ్తాల్​లో లేగదూడపై చిరుత దాడి - దూడపై చిరుత దాడి

చిరుత సంచారం ఆ గ్రామాల్లో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రంగారెడ్డి జిల్లా కడ్తాల్​ మండలం ముద్విన్​లో లేగదూడపై పులి దాడి చేసి చంపింది. మూడు నెలలుగా 16 పశువులపై దాడి చేసి చంపినా... అధికారులు బంధించడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిరుత దాడి

By

Published : May 7, 2019, 10:08 AM IST

రంగారెడ్డి జిల్లా కడ్తాల్​ మండలం ముద్విన్​లో లేగదూడపై చిరుత దాడి చేసింది. కొర్షకొండ తండా శివారులో రైతు రాజుకు చెందిన దూడను చంపింది. ఇప్పటివరకూ 16 పశువులను చిరుత హతమార్చినట్లు గ్రామస్థులు తెలిపారు. కడ్తాల్​, యాచారం, కందుకూరు మండలాల్లో 3 నెలలుగా చిరుత పులి సంచరిస్తున్నా అటవీ అధికారులు బంధించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు భయాందోళనలతో కాలం వెళ్లదీస్తున్నారు.

లేగదూడపై చిరుత దాడి

బోనులు ఏర్పాటు

చిరుత సంచరిస్తున్న మండలాల్లో బోనులు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్​కు అనుమతి లభించిందని అటవీ శాఖ రేంజ్​ అధికారి సత్యనారాయణ పేర్కొన్నారు. త్వరలోనే పులిని పట్టుకుంటామన్నారు.

ఇదీ చూడండి : మద్యం మత్తులో కానిస్టేబుల్ వీరంగం

ABOUT THE AUTHOR

...view details