కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి తన సొంత గ్రామమైన... రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్లో పర్యటించారు. గ్రామంలోని సీతారామాంజనేయ ఆలయంలో కుటుంబసమేతంగా పూజలు చేశారు. అనంతరం తల్లిదండ్రుల సమాధి వద్ద నివాళులు అర్పించారు. స్థానిక ముఖ్య నేతలతో గ్రామాభివృద్ధి గురించి చర్చించారు. సమస్యలను సావధానంగా విన్న మంత్రి... అన్నింటినీ పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. కిషన్ రెడ్డి రాకతో గ్రామస్థుల తోపాటు స్థానిక నాయకులు పెద్దఎత్తున తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన నాయకులతో కిషన్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
అన్ని సమస్యలు తీరుస్తా:కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి - కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి తన సొంత గ్రామంలో పర్యటించారు. దేవాలయంలో పూజలు, తల్లిదండ్రుల సమాధి వద్ద నివాళి అనంతరం గ్రామాభివృద్ధిపై చర్చించారు. ఊర్లో ఉన్న అన్ని సమస్యలు తీర్చేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.
CENTRAL MINISTER KISHAN REDDY VISITS HIS WON VILLAGE