తెలంగాణ

telangana

ETV Bharat / state

చూస్తుండగానే 'కారు' కాలిపోయింది! - ఇంజిన్​లో మంటలు చెలరేగి కారు దగ్ధం

ప్రయాణిస్తున్న కారులోంచి మంటలు చెలరేగి కారు దగ్ధమైన ఘటన రంగారెడ్డి జిల్లా పల్లెచెల్క తండా సమీపంలో చోటుచేసుకుంది. ఇంజిన్​ నుంచి పొగలు రావడం గమనించి అప్రమత్తమయ్యే లోపు కారు మంటల్లో కాలిపోయింది.

car burn with fire in engine at pallechelka thanda
చూస్తుండగానే 'కారు' కాలిపోయింది!

By

Published : Mar 17, 2020, 6:35 PM IST

రంగారెడ్డి జిల్లా కడ్తాల్​ మండలం పల్లెచెల్క తండా సమీపంలో కారు అగ్ని ప్రమాదానికి గురైంది. చరిగొండ నుంచి హైదరాబాద్​కు వెళ్తుండగా ఒక్కసారిగా కారులోంచి పొగలు వ్యాపించాయి. చరిగొండకు చెందిన మహేష్, సాయి, శివ ఓ వివాహానికి హాజరై తిరిగి వెళ్తుండగా కారులో నుంచి పొగలు వస్తున్నట్టు గమనించారు. కారు దిగి అప్రమత్తమయ్యే లోపు మంటలు చెలరేగాయి.

కారులో ఉన్న సామగ్రిని బయటకు తీసి, మంటలు ఆర్పేందుకు నీళ్లు తెచ్చే లోపే మంటలు విపరీతంగా పెరిగాయి. పరిస్థితి చేయిదాటిపోయి కారు పూర్తిగా దగ్ధమైంది. కారు కాలిపోయినా.. ప్రాణనష్టం జరగలేదు.

చూస్తుండగానే 'కారు' కాలిపోయింది!

ఇదీ చూడండి:కరోనా ఎఫెక్ట్​: ఫ్లాట్​ఫామ్​ టికెట్​ ధర పెంపు

ABOUT THE AUTHOR

...view details