భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించడానికి వ్యవసాయ శాఖ కార్యదర్శి డాక్టర్ బి.జనార్దన్ రెడ్డి రంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. మహేశ్వరం మండలం నందిగం, రావిరాల గ్రామాల్లో వరద ప్రభావంతో దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించారు. రావిరాలలో 300 ఎకరాల విస్తీర్ణంలో వేసిన వరి నీట మునిగింది.
రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ శాఖ కార్యదర్శి పర్యటన - నీట మునిగిన పంటలు
భారీ వర్షాలు.. వరదల్లో దెబ్బతిన్న పొలాలను వ్యవసాయ శాఖ కార్యదర్శి డాక్టర్ బి. జనార్దన్ రెడ్డి సందర్శించారు. రంగారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆయన జిల్లాలో వందల ఎకరాల్లో చేతికొచ్చిన పంట నీట మునిగిందని తెలిపారు.
రంగారెడ్డి జిల్లాలో పర్యటించిన వ్యవసాయ శాఖ కార్యదర్శి
చెరువు పొంగి ప్రవహించడం వల్ల వరద ఉద్ధృతికి 314 మంది రైతుల పంట పొలాలు గత ఆరురోజులుగా నీటిలో మునిగిపోయి ఉన్నట్టు ఆయన తెలిపారు. నారాగంలో 100 ఎకరాల్లో 139 మంది రైతుల పొలాలు దెబ్బతిన్నాయి. ఏనుగు చెరువు వరద పొంగడం వల్ల మరో 15 ఎకరాల పంటపొలాలు నీట మునిగాయి. చేతికొచ్చిన పత్తి, కంది పంటలు చేతికొచ్చాయి. కూరగాయల పంటలను పరిశీలించిన ఆయన కూరగాయలు పండించే రైతులు పూర్తిగా నష్టపోయినట్టు తెలిపారు.
ఇవీ చూడండి:మళ్లీ వరుణ ప్రతాపం.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల ఆదేశం