తెలంగాణ

telangana

By

Published : Jun 2, 2021, 3:34 PM IST

ETV Bharat / state

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రక్తదానం

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరింంచుకుని రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నంలో.. పోలీసు శాఖ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్​లోని యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

రక్తదాన శిబిరం
రక్తదాన శిబిరం

రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నంలో.. రాచకొండ పోలీసులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీల ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి మంచి స్పందన లభించింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో.. డివిజన్​లోని సుమారు 200 మంది యువకులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్ హాజరయ్యారు.

కరోనా బాధితులు.. రక్తం కొరతతో అనేక ఇబ్బందులు పడుతున్నారని డీసీపీ వివరించారు. రక్తదానం చేసేందుకు యువత పెద్ద ఎత్తున తరలి రావడం.. ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. రక్తదానం చేయడం వల్ల ఇతరుల ప్రాణాలను కాపాడిన వాళ్లమవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ యాదగిరిరెడ్డి, సీఐలు, ఎస్సైలు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి:ktr: అమరవీరులకు నివాళులర్పించిన మంత్రి కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details