తెలంగాణ

telangana

ETV Bharat / state

'మున్సిపల్​ ఎన్నికల్లో మాకు గెలుపు ఖాయం' - భాజపా సమావేశం

రాష్ట్రంలో తెరాస ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ పార్టీ భాజపానేని మున్సిపల్​ ఎన్నికల్లో తమకు గెలుపు ఖాయం అని భాజపా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి తెలిపారు. తుర్కయంజాల్​ మున్సిపాలిటీ పరిధిలోని భాజపా కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.

bjp meeting in rangareddy district
'మున్సిపల్​ ఎన్నికల్లో మాకు గెలుపు ఖాయం'

By

Published : Dec 28, 2019, 12:29 PM IST

రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఓ గార్డెన్​లో భాజపా కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భాజపా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను, తెరాస ప్రభుత్వ అసమర్థ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలో తెరాస ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ పార్టీ భాజపానేని.. జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో భాజపా గెలుపునకు ప్రతి ఒక్కరు కృషిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

'మున్సిపల్​ ఎన్నికల్లో మాకు గెలుపు ఖాయం'

ఇదీ చూడండి: 'మున్సిపోల్స్' ప్రతిపైసా లెక్కచెప్పాల్సిందే..!

ABOUT THE AUTHOR

...view details