తెలంగాణ హైకోర్టులో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పదవులను భర్తీ చేయాలన్న సీజేఐ నిర్ణయంపై బార్ కౌన్సిల్ మెంబర్, న్యాయవాది ఫణీంద్ర భార్గవ్ కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా దిగువ కోర్టుల్లో సమర్థవంతమైన న్యాయవాదులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన అభ్యర్థించారు.
'హైకోర్టులో ఖాళీల భర్తీ నిర్ణయంపై సీజేఐకి కృతజ్ఞతలు' - న్యాయవాది ఫణీంద్ర భార్గవ్
రాష్ట్ర హైకోర్టులో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పదవులను భర్తీ చేసేందుకు తీసుకున్న నిర్ణయంపై సీజేఐ ఎన్వీ రమణకు బార్ కౌన్సిల్ మెంబర్, న్యాయవాది ఫణీంద్ర భార్గవ్ కృతజ్ఞతలు తెలియజేశారు. చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యను పరిష్కరించినందుకు హైదరాబాద్లో సీజేఐని కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా న్యాయమూర్తుల నియామకాల్లో దిగువ కోర్టుల్లోని న్యాయవాదులను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
చాలా సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యను పరిష్కరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. దిగువ కోర్టుల్లో న్యాయవాదులు సైతం ప్రజలకు సేవలందించడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని ఆయన అన్నారు. వారి న్యాయ పరిజ్ఞానం, సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సీజేఐకి విజ్ఞప్తి చేశారు.
హైకోర్టు న్యాయమూర్తుల ఖాళీలన్నీ హైకోర్టు న్యాయవాదులతో మాత్రమే భర్తీ చేస్తున్నారని ప్రస్తావించారు. దిగువ కోర్టు న్యాయవాదులకు అవకాశం లభించడం లేదని సీజేఐ దృష్టికి తెచ్చారు. కానీ వారికి కూడా మెరిట్ ప్రాతిపదికన హైకోర్టులో భర్తీ చేస్తున్న ఖాళీల్లో సమాన అవకాశమివ్వాలని అభ్యర్థించారు. మా విజ్ఞప్తిని స్వీకరించి హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో కింది కోర్టుల న్యాయవాదులను పరిగణనలోకి తీసుకోవాలని బార్ కౌన్సిల్ మెంబర్, న్యాయవాది ఫణీంద్ర భార్గవ్ సీజేఐకి విజ్ఞప్తి చేశారు.