తెలంగాణ

telangana

ETV Bharat / state

గోవుల అక్రమ రవాణా.. అడ్డుకున్న బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు - బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు

రంగారెడ్డి జిల్లాలో గోవులను అక్రమంగా తరలిస్తున్న ఓ వాహనాన్ని బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆవులను గోశాలకు తరలించారు.

Bajrang Dal activists blocked the smuggling of cows
గోవుల అక్రమ రవాణ.. అడ్డుకున్న బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు

By

Published : Mar 1, 2021, 6:59 AM IST

గోవులను తరలిస్తున్న డీసీఎం వ్యాన్‌ను బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ తొండుపల్లి గేట్‌ సమీపంలో డీసీఎం వ్యాన్‌లో 27 గోవులను తరలిస్తుండగా కార్యకర్తలు అడ్డుకుని పోలీసులకు సమాచారమిచ్చారు.

ఆవులను అక్రమంగా తరలిస్తున్న వారికి, అడ్డుకున్న కార్యకర్తలకు మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇరువర్గాలకు నచ్చజెప్పిన పోలీసులు గోవులను గోశాలకు తరలించారు.

ఇదీ చదవండి:'కేసీఆర్.. జంట హత్యలపై ఎందుకు స్పందించడం లేదు?'

ABOUT THE AUTHOR

...view details