ఓటు హక్కును ప్రతి ఒక్కరు.. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా.. వినియోగించుకోవాలని ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈనాడు- ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్, ఇబ్రహీంపట్నం తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఏసీపీ యాదగిరి రెడ్డి తదితరులు హాజరయ్యారు.
'ఓటు ఆయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకోండి' - Awareness on vote casting
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈనాడు- ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్ హాజరయ్యారు.
ఓటు హక్కుపై అవగాహన సదస్సు
విద్యార్థులకు ఓటు ప్రాముఖ్యత గురించి వివరించారు. సమాజంలో మార్పు రావాలంటే ఓటు అనే ఆయుధాన్ని యువత తప్పనిసరిగా వినియోగించుకోవాలన్నారు. ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని అన్నారు.
TAGGED:
Awareness on vote casting