విద్యార్థులు, యువతకు సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత చేరువ చేసే ఉద్దేశంతో పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ల్యాబ్లను ప్రారంభించడం జరిగిందని పల్లవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఛైర్మన్ కొమురయ్య అన్నారు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం గండిపేట శివారులోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో కృత్రిమ మేధ ప్రయోగశాలను ప్రారంభించారు. ముఖ్యఅతిథులుగా పల్లవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఛైర్మన్ కొమురయ్య, క్రికెట్ క్లబ్ సంస్థ సీఈవో గణేశ్, బీఎండబ్ల్యూ సీఈవో రష్మి, ఫ్లిప్సైడ్ సీఈవో శ్రీని పాల్గొన్నారు.